రేవంత్రెడ్డి సీఎం.. నేను మంత్రినైత: కొండా సురేఖ

రేవంత్రెడ్డి సీఎం.. నేను మంత్రినైత: కొండా సురేఖ
  • బీఆర్ఎస్, బీజేపీ రెండు వేర్వేరు కాదు
  • కాంగ్రెస్‌ నేత కొండా సురేఖ

ఖిలా వరంగల్: తెలంగాణతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ త్వరలో అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని, తాను మంత్రిని అవుతానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని రంగశాయిపేటలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘బీఆర్ఎస్, బీజేపీ రెండు వేర్వేరు కాదు. చీకటి ఒప్పందం కారణంగానే లిక్కర్ స్కాం కేసులో కవితకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశారు’ అని సురేఖ ఆరోపించారు.

పోలీస్ స్టేషన్ లో ధర్నా 

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కనుసన్నల్లో పోలీసులు సీపీఎం, సీపీఐ నేతలను బెదిరింపులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత కొండాసురేఖ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ పేదల గుడిసెల్లో ఉన్న వారిని బీఆర్ఎస్ పార్టీలో చేరేలా ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. ఇదే విషయమై నిలదీసినందుకు సీపీఎం, సీపీఐ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ALSO READ : బీఆర్ఎస్ X కాంగ్రెస్!.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం