
మంత్రి కొండా సురేఖ కన్నీరుమున్నీరయ్యారు. అల్లారు ముద్దుగా చూసుకున్న హ్యాపీ(పెంపుడు కుక్క) ఆకస్మిక మరణంతో ఆమె భోరున విలపించారు. కొండా సురేఖ కుటుంబం ప్రాణంగా చూసుకుంటున్న హ్యాపీ అనే పెంపుడు కుక్క హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయింది. ఇంట్లో మనుషులతో సమానంగా చూసుకుంటున్న ఆ మూగ జీవం చనిపోయేసరికి మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
చనిపోయిన తన హ్యాపీకి తీరని బాధలోనూ మంత్రి కొండా సురేఖ ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. గత కొన్నాళ్ళుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, ఆమె సిబ్బంది గుర్తుచేసుకుని దు:ఖించారు.
పెంపుడు కుక్క గుండెపోటుతో చనిపోవడంతో విలపించిన మంత్రి కొండా సురేఖ#kondasurekha #Warangal #Telangana #MinisterKondaSurekha pic.twitter.com/JylCHiigt8
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) March 6, 2025
మనుషులతో పోలిస్తే కుక్క విశ్వాసమైన జంతువు. తన ఆకలి తీర్చే యజమాని పట్ల అదెంత ప్రేమను చూపిస్తుందో మాటల్లో వర్ణించలేం. తన అనుకున్న వాళ్లు కాసేపు కనిపించకపోతే అది పెట్టుకునే బెంగ మనుషుల్లోనూ కనిపించదు. ఇంటి నుంచి బయటకెళ్ళిన యజమాని తిరిగొకొచ్చే దాకా అది వేచి చూసే ధోరణి మీరు గమనించే ఉంటారు. ఎదుటి వారు సంతోషంగా ఉన్నారా..! బాధలో ఉన్నారా..! అనే భావోద్వేగాలను శునకం గుర్తించగలదు.
యజమాని ఆసుపత్రిలో చనిపోతే ఒక కుక్క ఆయన అంత్యక్రియలు ముగిశాక కూడా ఆ ఆసుపత్రిని వదిలి వెళ్లకుండా యజమాని కోసం ఎదురుచూసిన ఘటనలు కూడా గతంలో వెలుగుచూశాయి. పెంపుడు కుక్కతో మనిషి పెంచుకునే అనుబంధం, ఆ శునకం దూరమైతే పడే వేదన మాటల్లో చెప్పలేనిది. పెంపుడు కుక్కకు, మనిషికి ఉండే అనుబంధం ఎంతలా ఉంటుందో చార్లీ 777 సినిమాలో చూసే ఉంటారు.