కేసీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సార్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ప్రజల ముఖం చూడకుంటే ఎట్ల ?: కొండా సురేఖ

కేసీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సార్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ప్రజల ముఖం చూడకుంటే ఎట్ల ?: కొండా సురేఖ
  • గజ్వేల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వద్దా ?
  • దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

నాగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ‘సీఎంగా పనిచేసినన్ని రోజులు సెక్రటేరియట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాకపోతివి, అపోజిషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అసెంబ్లీకి రాకపోతివి.. నిన్ను గెలిపించుకున్న గజ్వేల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజల ముఖం చూడకపోతే ఎట్ల కేసీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సారూ’ అని దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. కేసీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా గజ్వేల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయం అందకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నాగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అచ్చంపేటలో సోమవారం నిర్వహించిన పలుకార్యక్రమాలకు మంత్రి హాజరై మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగితాలపై ఎమ్మెల్యే కేసీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతకం చేస్తే తప్ప లబ్ధిదారులకు చెక్కులు అందవన్నారు. మెదక్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రిగా రివ్యూ చేస్తున్న టైంలో ఈ అంశాలు బయటపడ్డాయన్నారు. బీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెడగొట్టిన తెలంగాణను సీఎం రేవంత్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బాగు చేస్తున్నారన్నారు. 

కానీ బీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు సోషల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాను అడ్డం పెట్టుకొని రాక్షసానందం పొందుతున్నారని, దీన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు సోషల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో యాక్టివ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పథకాల వల్ల పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.