- మంత్రి కొండా సురేఖ
- ఘనంగా కొండా మురళీధర్ రావు పుట్టినరోజు వేడుకలు
- 5 వేల మందితో మెగా రక్తదానశిబిరం
కాశీబుగ్గ, వెలుగు: కొండా అభిమానులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ర్ట పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. హంటర్ రోడ్‌లోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో కొండా అభిమానులు 5వేల మందితో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి సురేఖ ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు జన్మదినం సందర్భంగా భారీ కేక్‌ను ఆమె కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. కొండా మురళి పుట్టినరోజు రక్తదానం చేసి గొప్ప సందేశం ఇచ్చారన్నారు. ఇలాంటి అభిమానులను గుండెల్లో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహ్మద్ ఆయూబ్, గోపాల్ నవీన్ రాజ్, శ్రీనివాస్, కార్పొరేటర్లలు బాబు, అనిల్ కుమార్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, మహిళాలతో పాటు సుమారుగా 5వేల మంది కొండా అభిమానులు పాల్గొన్నారు.