ఫోన్ ట్యాపింగ్ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖపై కోర్టుకు వెళ్తానని.. న్యాయపరంగా తనపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటానని తెలిపారు.
అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు మంత్రి కొండా సురేఖ. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. లీగల్ నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటామని అందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే తప్పని సరిగా శిక్షకు అర్హులేనని చెప్పారు.
కేటీఆర్ భయంతో ఏదేదో దిగజారి మాట్లాడుతున్నారని సురేఖ మండిపడ్డారు. కేటీఆర్ భాష మార్చుకుంటే మంచిదని.. సీఎం పైనా కేటీఆర్ వాడే భాష సబబేనా అని ప్రశ్నించారు. కవిత జైలులో జపమాలా కావాలని అడుగుతున్నారు. పదేళ్ల కాలంలో ఆమె మెడలో తాళి బొట్టు చూడలేదని.. జైలుకు వెళ్లిన తర్వాత తాళిబొట్టు గుర్తుకు వచ్చిందా అని సురేఖ ప్రశ్నించారు.