రాజకీయంగా సెన్సేషన్ కోసమే అనుచిత వ్యాఖ్యలు

రాజకీయంగా సెన్సేషన్ కోసమే అనుచిత వ్యాఖ్యలు
  • మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసులో కోర్టులో నాగార్జున వాంగ్మూలం 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాజకీయంగా సె న్సేషన్ కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున అన్నారు. తమ కుటుంబం, వ్యక్తిగత జీవితం, ప్రొఫెషన్​కు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో తమ కుటుంబమంతా మానసిక వేదనకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నాంపల్లిలోని ఎక్సైజ్ స్పెషల్ కోర్టులో నాగార్జున వాంగ్మూలం ఇచ్చారు. మంగళవారం తన భార్య అమల, కొడుకు నాగచైతన్యతో కలిసి ఆయన కోర్టుకు వచ్చారు. ఓపెన్‌‌‌‌‌‌‌‌ కోర్టులో జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు. 

నాగార్జున అందించిన ఆధారాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని వాంగ్మూలంలో నాగార్జున తెలిపారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌, సినీ పరిశ్రమలోని సన్నిహితులు చాలా మంది ఫోన్స్‌‌‌‌‌‌‌‌ చేశారని పేర్కొన్నారు. తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలించిన మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.