మేడారం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న మంత్రి కొండా సురేఖ

మేడారం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న మంత్రి కొండా సురేఖ

ములుగు జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడారం సమ్మక్క, సారలమ్మలను కుటుంబ సమేతంగా దర్మించుకున్నారు. వనదేవతలకు బుధవారం ఆమె నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మంత్రి కొండా సురేఖ- భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, కూతురు సష్మిత పటేల్, అల్లుడు అభిలాష్, మనవడు శ్రీయాన్ష్ మురళీకృష్ణ లతోపాటు వనదేవతలను పూజించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి మంత్రి మనవడి తలనీలాలు సమర్పించారు. సమ్మక్క సారక్కల గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకున్నారు.

ALSO READ | రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్: దీపావళికి డబుల్ ధమాకా

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదివాసీ బిడ్డ మంత్రి సీతక్క, తాను మేడారం జాతరలో సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. వన దేవతలను దర్శించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుందని ఆమె చెప్పారు. రాష్ట్ర ఆర్థిక కష్టాలు గట్టెక్కేలా చూడాలని వనదేవతలను వేడుకున్నట్లు ఆమె మీడియాకు చెప్పారు.