పోటీపై కొండామురళి క్లారిటీ

హనుమకొండ: వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబసభ్యులు పోటీచేయబోయే నియోజకవర్గాలపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. కొండా కుటుంబం ఇద్దరు పోటీచేస్తారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలకు కొండా మురళి చెక్​ పెట్టారు. ఇవాళ హన్మకొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా ఫ్యామిలీ రెండు లేదా మూడు టికెట్లు అడుగుతున్నారన్నది తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. తాము వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. వరంగల్ తూర్పులో మాజీ మంత్రి కొండా సురేఖ లేదా తన కూతురు కొండా సుష్మిత మాత్రమే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. తమకు పదవులు కొత్తేమి కాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్​లో ఉన్పప్పుడు తాము పదవులు అనుభవించామని చెప్పుకొచ్చారు. తాము పార్టీ మారే ప్రసక్తే లేదని, కొండా మురళికి తగిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కేసీఆర్ కూతురు కవిత.. తన తండ్రి తాగుడు చూసే లిక్కర్ స్కామ్​లో అడుగు పెట్టిందన్నారు. జాగృతి అనే సంస్థను స్థాపించి.. అందరికి తాగుడు నేర్పడమే లక్ష్యం గా పనిచేస్తున్నారన్నారు.