హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో విధి కుక్కల బెడద పెరగడంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించేందుకు పైసలు ఉన్నాయి.. కానీ విధి కుక్కల బెడదను తొలిగించడానికి లేవా అని బుధవారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు. కుక్కలు చిన్న పిల్లలపై వరుసగా దాడులు చేస్తుంటే.. జీహెచ్ఎంసీకీ బాధ్యత లేదా అని విశ్వేశ్వర్ రెడ్డి నిలదీశారు.
మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నాం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్ని ఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవడ లేదని, ప్రభుత్వం తన పొరపాట్లను సరిదిద్దుకోవడం లేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో ఇదీ మున్సిపాలిటీల పరిస్ధితి అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.