కరీంనగర్ : ‘పల్లె గోస-.. బీజేపీ భరోసా బైక్ ర్యాలీ’ పర్యటన సందర్భంగా చాలా గ్రామాల్లో ప్రజా సమస్యలను చూశానని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయనుకున్నానని, కానీ, కరీంనగర్ జిల్లాలోనూ చాలా సమస్యలు ఉన్నట్లు ప్రత్యక్షంగా తెలుసుకున్నానని తెలిపారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
మానకొండూర్ మండలంలోని చాలా గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలన్నీ తీరాలంటే మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.