మునుగోడుకిచ్చిన హామీలు నెరవేర్చండి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

2023  ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్న్యాయం తామేనన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ దుష్ప్రచారాలు చేసి  గెలిచిందని ఆయన ఆరోపించారు. మునుగోడుకు టీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  ఇక టీఆర్ఎస్ ను ఎదురుకునే శక్తి కాంగ్రెస్ కు లేదన్నారు బూర నర్సయ్య గౌడ్ . ఆ పార్టీలోని వారందరూ కోవర్టులేనన్నారు. 2023 లో రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బూర ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సంక్షేమ స్పూర్తి ప్రధాత కేసీఆర్ కాదని, రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్ అని ఎద్దెవా చేశారు. ప్రతి నియోజకవర్గానికి కేసీఆర్ రూ. 500 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఓవరాల్ ఆధిక్యంతో ఎక్కడా వెనకబడకుండా టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి డిపాజిట్ గల్లంతైంది.