- మరో ఇద్దరు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎంపీలు కూడా..
- మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చండూరు, వెలుగు: నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు ప్రస్తుత మంత్రులు బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ, బీజేపీ లీడర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆ పార్టీ నాయకురాలు తుల ఉమతో కలిసి చండూరులో విలేకరులతో మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ లీడర్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అనేక సర్వేలు బీజేపీ గెలుపు ఖాయమని చెబుతుండడంతో టీఆర్ఎస్ లో వణుకు పుడుతోందని, దీంతో ముఖ్యమంత్రి కొడుకు స్వయంగా తమ లీడర్లకు ఫోన్లు చేస్తున్నారన్నారు. మునుగోడులో రాజగోపాల్రెడ్డి ఖాయమైపోయిందన్నారు.