కొండగట్టు, వెలుగు: కోమాలోకి వెళ్లిన కుటుంబ సభ్యుడు తిరిగి కోలుకోవడంతో ఓ కుటుంబం ఆదివారం కొండగట్టు అంజన్నకు వెయ్యి కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకుంది. పెద్దపల్లి జిల్లా 8ఇంక్లైన్ కాలనీకి చెందిన ఇంద్రసేన గౌడ్ కొడుకు అఖిల్ గౌడ్ సాఫ్టవేర్ఎంప్లాయ్. పని నిమిత్తం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన అఖిల్అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కోమాలోకి వెళ్లాడు. రెండేండ్ల తర్వాత ఇటీవల అఖిల్ కోలుకున్నాడు.
నెలరోజుల్లో నార్మల్అవడంతో, అతని ఫ్యామిలీ ఆదివారం కొండగట్టుకు చేరుకుని అంజన్నకు 1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంది. అంజన్న దయతోనే తన కొడుకు పూర్తిగా కోలుకున్నాడని ఇంద్రసేన తెలిపాడు.