అంజన్న ఆదాయం రూ. 48 లక్షలు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న హుండీని అధికారులు బుధవారం లెక్కించారు. 28 రోజులకు సంబంధించిన 11 హుండీలను లెక్కించగా రూ. 48, 83,262 లక్షల నగదు, ఎనిమిది గ్రాముల మిశ్రమ బంగారం, 2.6 కిలోల మిశ్రమ వెండి, 56 విదేశీ నోట్లు ఆదాయంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ లెక్కింపులో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఈవో వెంకటేశ్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, సూపరిండెంటు సునీల్, రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.