జగిత్యాల: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవో వెంకటేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. కొండగట్టు ఆలయంలో నిధులు దుర్వినియోగం, అవకతకలు జరిగినట్లు రుజువు కావడంతో ఆలయ ఈవో వెంకటేష్ ను సస్పెండ్ చేశారు. ఈవో వెంకటేష్ ను సస్సెండ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ కు కొండగట్టు ఆలయ ఈవోగా బాధ్యతలు అప్పజెప్పారు.
గత కొద్దిరోజులు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అక్రమాలు చోటు చేసుకోవడం, 50 లక్షల రూపాలయ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో కమిషనర్ సీరియర్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. రెండు రోజుల క్రితం అడిషనల్ డిప్యూటీ జ్యోతి విచారణ జరిపి నివేదిక అందించడంతో శనివారం (మార్చి 23) కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేష్ ను సస్పెండ్ చేశారు.