కొండగట్టు అంజన్నకు మలావత్  పూర్ణ పూజలు 

కొండగట్టు  అంజన్నకు మలావత్  పూర్ణ పూజలు 

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను అతి పిన్న వయసులో ఎవరెస్ట్​ శిఖరాన్ని అధిరోహించిన మలావత్  పూర్ణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆమెను శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

పూర్ణ మాట్లాడుతూ యువకులు అన్నిరంగాల్లో ముందుండాలని, పర్వతారోహణ చేయాలనుకునే వారికి తాను సహకరిస్తానని తెలిపారు.  మల్కాజ్ గిరి సీనియర్  సివిల్  జడ్జి మహేశ్ నాథ్, సిద్దిపేట సివిల్  జడ్జి చందన అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.