కొండగట్టుకు 2 లక్షల మంది భక్తులు..కన్నుల పండుగగా హనుమాన్‌‌‌‌ జయంతి

కొండగట్టుకు 2 లక్షల మంది భక్తులు..కన్నుల పండుగగా హనుమాన్‌‌‌‌ జయంతి

జగిత్యాల జిల్లా ముత్యంపేటలోని కొండగట్టు అంజన్న క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కాషాయ మయమైంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకొని, మాల విరమణ చేసినట్టు అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది.

కొండగట్టు, వెలుగు :  జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా గుట్టలు కాషాయ మయమయ్యాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు మార్మోగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకొని, మాల విరమణ చేసినట్టు అధికారులు తెలిపారు. హనుమాన్ పెద్ద జయంతి వేడుకల సందర్భంగా ఆలయాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

యాగశాలలో తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారాయణం, హావనం, శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, తులసీ దలాల అర్చన, హోమం నిర్వహించారు. మధ్యాహ్నం ఊయల సేవ, మంత్రపుష్పం, మహా నివేదన, పూర్ణాహుతి చేపట్టారు. రాత్రి సహస్ర దీపాలంకరణ, వెంకటేశ్వర స్వామి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో ఉత్సవాలు ముగిసినట్లు అర్చకులు, అధికారులు ప్రకటించారు. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. 
 

తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు..


కొండగట్టుకు భక్తులు భారీగా తరలిరావడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. మూడ్రోజుల పాటు జరిగే హనుమాన్‌‌‌‌ జయంతి వేడుకల్లో విధులు నిర్వహించడానికి వచ్చిన ఆఫీసర్లు, సిబ్బంది తమ బంధువులు, స్నేహితులను ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక దర్శనాలు చేయించడానికే ప్రయారిటీ ఇచ్చారు. వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని పోలీసులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. అలాగే, మాల విరమణ కోసం శనివారం అర్ధరాత్రి గుట్టకు చేరుకున్న స్వాములతో ఐదు కంపార్ట్‌‌‌‌మెంట్లు నిండిపోయాయి. ఒక్కసారిగా భక్తులు తరలిరావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ భక్తుడి చేయి విరిగింది. కాగా, శనివారం అర్ధరాత్రి వరకు కూడా భక్తుల  రద్దీ భారీగా ఉందని అధికారులు వెల్లడించారు.