
కొండగట్టు,వెలుగు: జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో ఈ నెల 11 నుంచి మూడు రోజులపాటు జరిగిన హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా భారీగా ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీకాంత్ సోమవారం తెలిపారు.
లడ్డూ, పులిహోర అమ్మకాలు, దీక్ష విరమణ, కేశ ఖండనం, దర్శనాలను కలుపుకుని రూ. కోటి 67 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. జయంతి ఉత్సవాలు విజయవంతంగా జరగడానికి సహకరించిన కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులకు కృతజ్ఞతలు ఆయన తెలిపారు.