కొండగట్టు అంజన్న వెండి కానుకలు బ్యాంకులో డిపాజిట్

కొండగట్టు అంజన్న వెండి కానుకలు బ్యాంకులో డిపాజిట్

కొండగట్టు, వెలుగు: కొండగట్టు ఆలయా నికి భక్తులు సమర్పించిన 4 క్వింటాళ్ల వెండి కానుకలను అధికారులు గురువారం బ్యాంకులో డిపాజిట్ చేశారు. కొద్ది రోజుల కింద ఆలయ హుండీలో వేసిన వెండి నగలను అధికారులు హైదరాబాద్లోని మింట్ కు తరలించారు. అక్కడ వాటిని కరిగించి 31 బార్లుగా తయారు చేసి పోలీస్ ఎస్కార్ట్లో జగిత్యాలలోని యూనియన్ బ్యాంకు లాకర్లో జమ చేసినట్లు ఈవో వెంకటేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శ్రీనివాస్ శర్మ, సునీల్ పాల్గొన్నారు.