కొండగట్టు డైరెక్టర్ రాజీనామా

కొడిమ్యాల,వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయ డైరెక్టర్ పోచమల్ల ప్రవీణ్ మంగళవారం ఆలయ ధర్మకర్త  పదవికి రాజీనామా చేశారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొందిన ధర్మకర్త పదవిలో కొనసాగడం సమంజసం కాదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం ఈవో వెంకటేశ్ ను కలిసి ఆయన రాజీనామాను అందజేశారు.