కొండగట్టు అంజన్నకు రూ.1.50 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌కం

కొండగట్టు అంజన్నకు రూ.1.50 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌కం

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన అంజన్న పెద్ద జయంతి సందర్భంగా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల టికెట్ల అమ్మకం ద్వారా రూ. 1,51,38,490 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. అత్యధికంగా మాల విరమణ ద్వారా రూ. 31 లక్షల ఇన్‌‌‌‌‌‌‌‌కం వచ్చిందన్నారు. హనుమాన్‌‌‌‌‌‌‌‌ పెద్ద జయంతి సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల పాటు భక్తుల రద్దీ నెలకొందని ఆఫీసర్లు తెలిపారు.