
కొండగట్టు, వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయంలో బుధవారం 12 హుండీలను లెక్కించారు. 48 రోజులకు గానూ రూ.1,11,07329 నగదు, 74 గ్రాముల బంగారం, 5.5 కిలోల వెండి, 40 విదేశీ కరెన్సీ ఆదాయంగా వచ్చినట్లు ఈవో చంద్ర శేఖర్ తెలిపారు.
ఈ లెక్కింపులో 350 మంది సిబ్బంది పాల్గొన్నారు. కాగా గతంలో హుండీ లెక్కింపులో రెండుసార్లు దొంగతనం జరిగినా అధికారుల తీరు మారలేదు. లెక్కింపులో పూర్తిగా మహిళలే పాల్గొనగా.. వారిని తనిఖీ చేసేందుకు ఒక్క మహిళా కానిస్టేబుల్‌ను మాత్రమే నియమించారు.