జగిత్యాల జిల్లాలో కొండగట్టు హుండీ ఆదాయం..రూ.56.78 లక్షలు

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపును అధికారులు బుధవారం చేపట్టారు. ఆలయంలోని 12 హుండీలను లెక్కించగా రూ.56,78,169 నగదు, 14 గ్రాముల బంగారం, 1.700 కిలోల వెండి, 15 విదేశీ కరెన్సీ ఆదాయం వచ్చిందని టెంపుల్ ఈఓ వెంకటేశ్  తెలిపారు. ఈ లెక్కింపులో అసిస్టెంట్  కమిషనర్  చంద్రశేఖర్, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్  శ్రీనివాస శర్మ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.