కొండగట్టుకు కేసీఆర్... దర్శనాలు బంద్

సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన సందర్భంగా అధికారులు నిన్న రాత్రి నుంచి కొండగట్టు ఆలయ దర్శనాలు నిలిపివేశారు. ఆ విషయం తెలియక వచ్చిన భక్తులను పోలీసులు కొండ పైకి అనుమతించడం లేదు. దీంతో కొండ దిగువన ఉన్న ఆంజనేయ స్వామికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంతే కాకుడంగా సీఎం రాక నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల దుకాణాలను కూడా పోలీసులు మూసివేశారు. అంతకు మునుపు గంగాధర మండలం రేలపల్లికి చెందిన 9 మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గతంలో చర్లపల్లి బలవంతపూర్ మీదుగా తమ గ్రామానికి రోడ్డు వేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే మాట ఇచ్చి తప్పడంతో సీఎం ముందు తమ నిరసన తెలిపేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తుగా  అదుపులోకి తీసుకున్నారు.