ఆంజన్న హుండీ ఆదాయం రూ.1.01 కోట్లు

ఆంజన్న హుండీ ఆదాయం రూ.1.01 కోట్లు

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల హుండీ లెక్కింపును ఆధికారులు ఇవాళ నిర్వహించారు. ఇందులో భాగంగా 63 రోజులకు రూ. 1,01,73,995 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.  గురువారం ఈ మేర‌కు ఓ ప్రక‌ట‌న‌ల విడుద‌ల చేశారు. గ‌త 63 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల్లో 3.700 కిలోల మిశ్రమ వెండి,92 గ్రాముల మిశ్రమ బంగారం, 40 విదేశీ కరెన్సీ ఆదాయంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.