- అంజన్న సన్నిధిలో
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూజలు
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రూ. వెయ్యి కోట్లతో కొండగట్టు అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేసినట్టు, ప్రస్తుత సర్కార్ పనులు చేపట్టాలని కోరారు.
రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేయాలని, ఆలయ భూములను కాపాడే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆమె వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ వసంత, కొడిమ్యాల మాజీ జడ్పీటీసీ ప్రశాంతి స్థానిక నేతలు పాల్గొన్నారు.