హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వివిధ టికెట్ల ద్వారా కోటి 45 లక్షల 65 వేల 445 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల జయంతి ఉత్సవాలకు సంబంధించి లడ్డు ప్రసాదం ద్వారా 71 లక్షల 92 వేల 720, పులిహోర ద్వారా 14 లక్షల 19 వేల 525, ప్రత్యేక దర్శనం ద్వారా 11 లక్షల 65 వేల 400, మాల విరమణ ద్వారా 35 లక్షల 83 వేలు, కేశఖండనం ద్వారా 12 లక్షల 4 వేల 800 వచ్చినట్లుగా ఆలయ ఈవో వెల్లడించారు. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు