కేసీఆర్ పర్యటనతో కొండగట్టు దర్శనాలు బంద్.. భక్తుల తిప్పలు

జగిత్యాల : సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా.. రాత్రి నుంచి కొండగట్టు ఆలయ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. దీంతో విషయం తెలియక ముందే కొండగట్టుకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంజన్న దర్శనం కోసం భక్తులను పోలీసులు కొండపైకి అనుమతించడం లేదు. దీంతో వారంతా అక్కడే పడిగాపులు పడుతున్నారు. మంగళవారం రాత్రే కొండగట్టుకు వచ్చి రూమ్ తీసుకుని ఉన్నామని.. అంజన్న దర్శనం కోసం వేచి చూస్తున్నామని భక్తులు వాపోతున్నారు. మరికొంతమంది రోడ్డుకు ఇరువైపులా కూర్చొని చంటి పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. స్వామి దర్శనానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరుతున్నారు.