- కాంగ్రెస్ నేతలు కొండల్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రావు
కామారెడ్డి, కామారెడ్డిటౌన్, వెలుగు : రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ నేతలు కొండల్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి తరపున నియోజక వర్గంలో మంగళవారం ఆ పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. మంగళవారం పొద్దున జిల్లా కేంద్రంలో వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొండల్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలను తమ పార్టీ సమానంగా చూస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కొత్త బస్టాండు ఎదుట ఉన్న చాయ్ హోటల్స్‌లో కూడా కొండల్‌రెడ్డి చాయ్ తయారీ చేస్తూ ప్రజలతో మాట్లాడారు. తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదన్నారు. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే ఆయన సీఎంఅవుతారన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో జరిగిన కుర్మ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కొండల్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి రిజ్వాన్ పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీటింగ్‌లో పీసీసీ జనరల్ సెక్రెటరీ పున్న కైలాస్ నేత మాట్లాడుతూరాష్ర్ట భవిష్యత్తును నిర్ణయించేది కామారెడ్డి నియోజక వర్గమని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు రజాక్, శివకృష్ణమూరక్తి, ప్రసాద్‌గౌడ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి : మురళి నాయక్