రీకౌటింగ్​లోనూ బీఆర్ఎస్  అభ్యర్థి విజయం

కరీంనగర్ టౌన్, వెలుగు :  కరీంనగర్  నగరపాలక సంస్థ 39వ డివిజన్ కార్పొరేటర్  రీకౌంటింగ్ లో పాత అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన  కొండపల్లి సరిత విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆమె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

2020లో జరిగిన కరీంనగర్  మున్సిపల్ ఎన్నికల్లో తన చేతిలో ఓటమి పాలైన ఇండిపెండెంట్ అభ్యర్థి ఊట్కూరి మంజుల భార్గవి తన ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. శనివారం కోర్టులో జరిగిన రీకౌంటింగ్ లో 46 ఓట్లతో  తానే విజయం సాధించానని సరిత వెల్లడించారు. నిజాయితీగా గెలవడం తనకు సంతోషంగా 
ఉందన్నారు.