రైతులకు అండగా మోడీ ప్రభుత్వం: కొండపల్లి శ్రీధర్​రెడ్డి

రైతులకు అండగా  మోడీ ప్రభుత్వం:  కొండపల్లి శ్రీధర్​రెడ్డి

కూసుమంచి, వెలుగు: తెలంగాణ రైతులకు అండగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిలబడింద ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.  కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ నీటి కేటాయింపులు చేసే విధంగా ఉత్తర్వులు ఇచ్చిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ నాయకులు, రైతులు పాలేరు రిజర్వాయర్​ వద్ద సంబురాలు జరిపారు. మోదీ  ఫొటోకు క్షీరాభిషేకం నిర్వహించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ శాశ్వత పరిష్కారం కోసం కృష్ణ ట్రిబ్యునల్ ని  ఏర్పాటు చేశారన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటుతో  మనకు రావాల్సిన కృష్ణా జలాల వాటా అందుతుందన్నారు. కార్యక్రమంలో  తక్కెళ్ళపల్లి నరేందర్ రావు, నున్నా రవి, అనంత ఉపేందర్ గౌడ్, వీరెల్లి లక్ష్మయ్య,  మేక సంతోష్ రెడ్డి, నూకల రామ్మోహన్ రెడ్డి, కోటమర్తి సుదర్శన్, బజ్జూరి మల్లారెడ్డి, బొడ్డుపల్లి ప్రసాద్, గడ్డం వెంకటేశ్వర్లు, దాసరి వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు