మధిర, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మధిర నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం రోజే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించకపోవడం రైతాంగాన్ని మోసం చేయడమేనన్నారు.
రైతు భరోసా దేవుడెరుగు.. ఇంతవరకు రైతుల ఖాతాల్లో రైతు బంధు పైసలే రాలేదని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు , జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికారప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేశ్, మండల అధ్యక్షుడు గుండా చంద్రశేఖర్ రెడ్డి , యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుంచం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు