కొండపోచమ్మ జాతర షురూ

కొండపోచమ్మ జాతర షురూ

జగదేవపూర్, వెలుగు: మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ ఆలయంలో సోమవారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలు మూడు నెలల పాటు కొనసాగుతాయి. కొమురవెల్లిలో మల్లన్నను దర్శించుకున్న అనంతరం అగ్నిగుండాలు, పెద్ద పట్నం కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులంతా కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఆదివారం సాయంత్రం నుంచి భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలుకిక్కిరిసిపోయాయి. ఎస్ఐ చంద్రమోహన్ ట్రాఫిక్​ సమస్యలు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఆలయ ఈవో రవికుమార్, మాజీ సర్పంచ్ రజిత, ఆలయం వద్దనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.