రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సంబరాలు..

రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సంబరాలు..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానలు క్రాకర్స్ పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత ఊరు.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక నుంచి మా ఊరి పేరు కొండారెడ్డి పల్లి కాదని.. సీఎం ఊరు అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు, అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.