కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ డీసీసీ బ్యాంకు వ్యాపారంలో ఎస్బీఐ,యూబీఐ తర్వాత స్థానాన్ని సాధించిందని టీఎస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. సోమవారం స్థానిక కేడీసీసీ బ్యాంకులో న్యూ ఇయర్వేడుకలు నిర్వహించారు
ఈసందర్భంగా రవీందర్ రావు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడంచెల సహకార వ్యవస్థలో కేడీసీసీబీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. డీడీఎం మనోహర్ రెడ్డి, సీఈవో సత్యనారాయణ, వైస్ చైర్మన్ రమేశ్, జీఎంలు ప్రభాకర్ రెడ్డి,ఉషశ్రీ పాల్గొన్నారు.