ఫిడే విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రి చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ. హంపి, హారిక గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు డ్రా

ఫిడే విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రి చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ. హంపి, హారిక గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు డ్రా

చెన్నై: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక.. ఫిడే విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రి చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో రెండో రౌండ్​  గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  డ్రా చేసుకున్నారు. మంగళవారం మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హంపి 41 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. తెల్లపావులతో ఆడిన తెలుగు గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో మంచి స్ట్రాటజీలతో ఆకట్టుకుంది. కానీ మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెలియా పుంజుకోవడంతో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా వైపు వెళ్లింది.

కనిష్కా అలినా (రష్యా)తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హారిక 26 ఎత్తుల వద్ద డ్రాగా ముగించింది. ఇండియా ప్లేయర్లు ఆర్‌‌‌‌. వైశాలి  .. దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 26 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జుహు జినెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి రెండు పాయింట్లతో సంయుక్తంగా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతుండగా, హంపి ఒక పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నాలుగో స్థానంలో, హారిక అర్ధ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 9వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.