ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో పట్ల అసంతృప్తికి గురైన కోనప్ప .. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనంతరం కోనేరు కోనప్ప కాంగ్రెస్‌లో చేరనున్నున్నారని సమాచారం. కాగా గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్ప పై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఇక్కడి నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 3 వేల ఓట్ల తేడాతో కోనప్పపై విజయం సాధించారు.