స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫాం..కూ యాప్ వేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మిలియన్లలో యూజర్లు.. రోజువారీ, నెలవారీ యాక్టివ్ యూజర్లూ ఎక్కువే..పదికి పైగా భాషల్లో ఈ యాప్ అందుబాటులో కి వచ్చింది. కేంద్ర మంత్రులే ఈ యాప్ ను ఆత్మనిర్భర్ యాప్ గా ప్రచారం చేశారు. ఎల్లో పిట్ట లోగోతో జనాలతో బాగా కనెక్ట్ అయింది. విదేశాల్ల కూడా తన యాక్టివిటీస్ ను విస్తరించింది.. ఒకానొక దశలో ట్విట్టర్ కే ప్రత్యామ్నాయం అనుకున్నారు.అలాంటి యాప్ ఎందుకు మూతపడుతోంది.
2019లో ఫౌండర్లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా ఇద్దరు కలిసి కూ యాప్ ను ప్రారంభించారు. దాదాపు పదికి పైగా భాషల్లో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు ఉద్యమ సయమంలో కూ యాప్ చాలా గుర్తింపు పొంది. రైతు ఉద్యమ సమయంలో పలు అకౌంట్లను బ్లాక్ చేసిన విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం నెలకొంది. అప్పుడు ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఉండాలని .. కేంద్ర ప్రభుత్వం కూ యాప్ ను ప్రోత్సహించింది. స్వయంగా కేంద్ర మంత్రులే ఈ యాప్ ను ప్రమోట్ చేశారు.
కూ యాప్ లోగో కూడా ట్విట్టర్ పిట్టనే పోలి ఉండటం వల్ల దీనికి ప్లస్ అయింది.ట్విట్టర్ కు బ్లూ పిట్ లోగో ఉండగా.. కూ యాప్ కు ఎల్లో కలర్ బుల్లి పిట్ట లోగో ఉంది. ఈ లోగో జనాలతో బాగా కనెక్ట్ అయింది. బాగా ప్రాచుర్యం పొందింది. ఒకనొక దశల లో కూ యాప కు 21 లక్షల డైలీ యాక్షన్ యూజర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం కూ యాప్ కు 60 మిలియన్ల పైగా డౌన్ లోడ్స్ కూడా ఉన్నాయి.
ఎందుకు మూసివేస్తున్నారు?
కూ యాప్ ప్రజాదరణ పెరగడంతో భారత్ తో పాటు నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా తన కార్యకలాపాలకు విస్తరించింది. అయితే కూ యాప్ తన క్రేజ్ ను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది. తక్కువ సమయంలో నే కూ యాప్ నకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో 2024 లో లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగించింది. ఈ యాప్ ను మళ్లీ నిలబెట్టుకోవడం కోసం డైలీహంట్ తో సహా పలు కంపెనీలతో ఫౌండర్లు చర్చలు జరిపారు. అవేవీ ఫలించకపోవడంతో లిటిల్ ఎల్లో బర్డ్ గుడ్ బై చెబుతుందని లింక్ డ్ ఇన్ లో వ్యవస్థాపకులు తెలిపారు.