న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫాం..కూ (koo) గురించి మనకు తెలిసిందే. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం Xకి స్వదేశీ ప్రత్యామ్నాయంగా ప్రారంభించబడింది ఈ కూ మైక్రో బ్రాగింగ్ ప్లాట్ ఫాం. ప్రముఖులు, మంత్రులచే విస్తృతంగా ప్రచారం చేయబడింది. అయితే ఈ భారతీయ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ ‘కూ’ ఇప్పుడు నష్టాల్లో చిక్కుకుంది. దీనిని ఆన్ లైన్ మీడియా సంస్థ డైలీ హంట్ కొను గోలు చేయాలని భావించినప్పటికీ చర్చలు విఫలం కావడంతో నాలుగేళ్ల స్టార్టప్ ‘కూ ’సర్వీస్ లను మూసివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
మేం యాప్ ను కొనసాగించాలని కోరుకుంటున్నాం. కానీ సోషల్మీడియాల యాప్ ను అమలు చేయడానికి టెక్నాలజీ సర్వీస్ ఖర్చు ఎక్కువగా ఉంది.. అందుకే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకో వా ల్సి వచ్చిందని కూ కో ఫౌండర్స్ రాధాకృష్ణ, మయాంక్ బిదవత్ లు అన్నారు. పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, మీడియా సంస్థలతో పార్టినర్ షిప్ కోరుకున్నాం. కానీ చర్చలు కోరుకున్నంత ఫలితాలు ఇవ్వలేదన్నారు.
కూ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫాంను 2020లో ఫౌండర్లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదవత్కా ప్రారంభించారు. ఇది 10కి పైగా భాషల్లో అందుబాటులో ఉన్న మొట్ట మొదటి భారతీయ మైక్రో బ్లాగిం గ్ సైట్ . ఈ యాప్ లోగో పసుపు రంగు గల పక్షిని కలిగి ఉంటుంది. ప్రారంభించిన ప్పటినుంచి దాదాపు 60 మిలియన్ డౌన్ లోడ్ లను పొందింది.