తనపై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై ఫిర్యాదు చేసినట్లుగా కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ వెల్లడించారు. " లైవ్ డిబేట్ లో నేను ప్రజా సమస్యలు లేవనెత్తితే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ గౌడ్ వాటికీ సమాధానం చెప్పకుండా, ఉద్దేశపూర్వకంగా, నన్ను దుర్భాషలాడుతూ నాపై చేసిన భౌతిక దాడి గురించి సూరారం పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి పిర్యాదు చేయడం జరిగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది " అంటూ శ్రీశైలం గౌడ్ ట్వీట్ చేశారు.
Also Read :- ఎమ్మెల్యే రాజాసింగ్కు బెదిరింపు కాల్
ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? లైవ్ డిబేట్ లో నేను ప్రజా సమస్యలు లేవనెత్తితే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ గౌడ్ వాటికీ సమాధానం చెప్పకుండా, ఉద్దేశ పూర్వకంగా, నన్ను దుర్భాషలాడుతూ నాపై చేసిన భౌతిక దాడి గురించి సూరారం పోలీస్ స్టేషన్ లో… pic.twitter.com/V2t156377S
— Kuna Srisailam Goud (@KunaSrisailam) October 26, 2023
కుత్బుల్లాపూర్ లో బుధవారం నిర్వహించిన డిబేట్లో బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఒకరిపై ఒకరు భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఆరోపణలు తీవ్రం కాగా.. వివేకానంద సహనం కోల్పోయి శ్రీశైలంగౌడ్ మీదకు దూసుకెళ్లి ఆయన గొంతు పట్టుకున్నారు. దీంతో అక్కడున్న పోలీసులు వివేకానందను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు.