సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ది శాడిస్ట్ పాలన: కూనంనేని సాంబశివరావు

గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ది శాడిస్ట్ పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.  సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ కుమ్మక్కై ఒకరినొకరు తిట్టుకుంటున్నారన్నారు.  జెన్ కో, ట్రాన్స్ కోల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.29 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ALSO READ : ములుగు, జనగామ, తొర్రూరులో ప్రధాని ఫొటోకు క్షీరాభిషేకం

లేదంటే సీఎం ఆఫీస్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, లీడర్లు ఎల్‌‌‌‌‌‌‌‌.ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, రంగయ్య, కె.వీరభద్రం, వైవీ రావు, ఎల్లాగౌడ్‌‌‌‌‌‌‌‌, సమ్మయ్య, స్వామి పాల్గొన్నారు.