పాల్వంచ, వెలుగు : చిన్నతనం నుంచే క్రీడల్లో చురుకుగా పాల్గొనే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఫిట్నెస్ సాధిస్తున్నారని కొత్త గూడెం ఎమ్మెల్యే కూనంనేని సాం బశివరావు అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో మూడు రోజులపాటు కొనసాగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు సహజంగానే దృఢంగా ఉంటారని, వారికి సరైన శిక్షణ ఇస్తే జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపిస్తారని తెలిపారు.
ఐటీ డీఏ పీవో ప్రతీక్ జైన్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడాల్లో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. అనంతరం విజేతలకు షీల్డ్ లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజు, డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ, రాష్ట్ర అధికారి బి.జ్యోతి, జిల్లా అధికారి గోపాల్ రావు, వివిధ ప్రాంతాల అధికారులు బి.రమేష్ , మీనారెడ్డి, కిష్టు, చందన ,చంద్రమోహన్, జహీ రుద్దీన్, పి.నరసింహారావు, బి .రూప, టి.రమణయ్య, డి.నాగేశ్వరరావు, బి.చందు ,శారద, బానోత్ నామా, వీరా నాయక్ పాల్గొన్నారు.