కౌసిక్​ రెడ్డికి ఆస్థాయి లేదు: ఎమ్మెల్సీ బల్మూరి

కౌసిక్​ రెడ్డికి ఆస్థాయి లేదు: ఎమ్మెల్సీ బల్మూరి
  • కౌశిక్​రెడ్డి స్థాయికి మించి ఊహించుకుంటుండు
  • ఊర్లో పెండ్లికి కుక్కల హడావిడిలా తయారైండు: ఎమ్మెల్సీ బల్మూరి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనకు తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ‘‘ఊర్లో పెండ్లైతే కుక్కలు హడావిడి చేసినట్టు.. ఏ ఇష్యూ జరిగినా.. అది నాకే జరిగింది.. నాపైనే జరిగింది.. నాకు ఇట్ల జరిగింది. నాకు అట్ల జరిగింది.. అని కథలు కథలుగా చెప్పుకుంటున్నాడు”అని వెంకట్​ఎద్దేవా చేశారు. ఒక కానిస్టేబుల్​అడ్డుకుంటూనే సోషల్​మీడియాలో పెట్టుకుండటాడని, తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటూ ఆంబోతులా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని వెంకట్​ మండిపడ్డారు.  మంగళవారం గాంధీ భవన్ లో వెంకట్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్ టెస్టుపై కౌశిక్ స్పందన వింతగా ఉందని, గ్యాస్ట్రో ఎంటరాలజీ నాగేశ్వర్ రావు వద్ద శాంపిల్ ఇస్తానంటున్నాడని.. అసలు డ్రగ్స్ టెస్టులకు.. గ్యాస్ట్రో ఎంట్రాలజీకి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్టు ఎక్కడ ఇయ్యాలో కూడా ఆయనకు తెలియదన్నారు. ‘‘కొకైన్ తీసుకున్న వాళ్లతో మీకు ఉన్న సంబంధం ఏమిటి? దీనికి మీ బాస్ కేటీఆర్ సమాధానం చెప్పాలని” వెంకట్​డిమాండ్ చేశారు.  

కౌశిక్..  టెస్టులకు శాంపిల్​ ఇచ్చే దమ్ము లేదా..?

బీఆర్​ఎస్​లో ఫేకు సలీం లాగా కౌశిక్ రెడ్డి ఉన్నాడని ఎంపీ అనిల్​ కుమార్​ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. డ్రగ్స్​ టెస్టులపై కౌశిక్​ రెడ్డి చేసిన సవాల్​ను స్వీకరించిన అనిల్​కుమార్​ యాదవ్​, బల్మూరి వెంకట్ లు మంగళవారం రాత్రిగచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్​కు వెళ్లారు. దాదాపు రెండు గంటలపాటు అక్కడ ఎదురుచూశారు. ఎంతకు కౌశిక్​ రెడ్డి, బీఆర్​ఎస్​ లీడర్లు రాకపోవడంతో వెనుతిరిగారు.