సభలో భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకున్న కొప్పుల

జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తన పార్టీ వాళ్లే తనకు అన్యాయం చేశారని కార్యకర్తలు కొప్పులతో చెప్పుకుంటూ.. ఆయన్ని పట్టుకొని బోరున ఏడ్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి కార్యకర్తల సమావేశంలో కొప్పుల పాల్గొన్నారు.  

పదేళ్లలో కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని.. బీఅర్ఎస్ పాలనపై ప్రజల వ్యతిరేకతే దీనికి కారణమని కొప్పుల అన్నారు. ఇప్పటి ఎన్నికల ఫలితాలు.. స్పీడ్ బ్రేకర్ లాంటివి మాత్రమేనని తెలిపారు. 

కాగా తమ పార్టీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడడం సరికాదని కొప్పుల అన్నారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పి.. కాంగ్రెస్ రాష్ట్రాని పాలిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకం తనకు లేదని కొప్పుల చెప్పారు.