కాంగ్రెస్ గెలుపుతో రౌడీ రాజకీయాలకు స్వస్తి  : కోరం కనకయ్య

ఇల్లెందు, వెలుగు : రాష్ట్రంలో ప్రస్తుతం రౌడీ రాజకీయాలు, అరాచక పాలన నడుస్తోందని, కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే వాటికి స్వస్తి పలుకనుందని కాంగ్రెస్​ ఇల్లెందు అభ్యర్థి, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య తెలిపారు. ఆదివారం గార్ల, బయ్యారం మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్​షో లో ఆయన మాట్లాడారు. పదేండ్లలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని తెలిపారు. ఉద్యోగాలు లేక యువత కూలీలుగా  మారారన్నారు.

బీఆర్​ఎస్ ​సర్కారుకు మద్యం దుకాణాలపై ఉన్న శ్రద్ధ మనుషుల జీవితాల మీద లేదని మండిపడ్డారు. అనంతరం బయ్యారం మండల కేంద్రంలోను రోడ్​షో నిర్వహించారు. కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. గార్ల మండల పార్టీ అధ్యక్షుడు రామారావు, సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, జడ్పీటీసీ ఝాన్సీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

టీడీపీ నాయకుల ప్రచారం 

ఇల్లెందు నియోజకవర్గంలో కోరం కనకయ్య  భారీ మెజారిటీతో గెలవబోతున్నారని,  దానికోసం  టీడీపీ కృషి చేస్తోందని ఆ పార్టీ మహబుబాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ కో-ఆర్డీనేటర్​ ముద్రగద వంశీ తెలిపారు. ఆదివారం  ఆయన ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ సెంటర్ నుంచి అంబజార్ మీదుగా జగదాంబ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కోరం కనకయ్యకు మద్దతు తెలిపారు.