చిరుతో విభేదాలపై స్పందించిన కొరటాల శివ.

చిరుతో విభేదాలపై స్పందించిన కొరటాల శివ.

ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర పార్ట్ 1 ఈ నెల 27వ తారీఖున భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే దేవర చిత్ర ట్రైలర్లు విడుదలకాగా మంచి హైప్ ఇచ్చాయి. 

అయితే గతంలో కొరటాల శివ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అప్పట్లో మెగాస్టార్ తో కొరటాల శివ కి మనస్పర్థలు, విభేదాలు ఏర్పడ్డాయని పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి.అయితే దేవర చిత్ర ప్రమోషన్స్ లో కొరటాల శివ చిరుతో విభేదాల విషయంపై స్పందించాడు. ఇందులోభాగంగా తనకి చిరంజీవికి మధ్య ఎలాంటి విభేధాలు లేవని క్లారిటీ ఇచ్చాడు. 

ALSO READ | పళని ఆలయం పంచామృతంలో వయాగ్రాలా : తమిళ దర్శకుడు అరెస్ట్

అంతేగాకుండా ఆచార్య చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత మెగాస్టార్ స్వయంగా తనకి మెసేజ్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని, ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ లు కామన్ అని ధైర్యం చెప్పాడని తెలిపాడు. కానీ ఈ విషయాలు తెలియని కొందరు తమ గురించి ఏవేవో కల్పితాలు సృష్టించి తప్పుగా ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు.

ఇక దేవర చిత్రం విషయానికొస్తే ఈ చిత్రం కోసం కొరటాల శివ దాదాపుగా రెండేళ్లపాటూ శ్రమించాడు. దీనికితోడు గతంలో తాను  డైరెక్ట్ చేసిన ఆచార్య చిత్రం ఫ్లాప్ అవ్వడంతో కొరటాల కెరీర్ లో దేవర హిట్ కీ రోల్ ప్లే చేయబోతోంది. మరి దేవర చిత్రంతో కొరటాల శివ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.