దేవర మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చిన.. డైరెక్టర్ కొరటాల శివ

టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా వస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara). డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుండి సెన్సేషన్ అప్డేట్ ఇచ్చారు కొరటాల శివ. దేవర మూవీ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దేవర ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతుందంటూ..ప్రస్తుతం కోస్టల్కు సంబంధించిన సీన్స్ ను తెరకెక్కించినట్లు స్పష్టం చేశారు.

డైరెక్టర్ కొరటాల శివ వీడియో ద్వారా మాట్లాడుతూ..ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని వెల్లడించారు. అందుకే ఒకే భాగంలో దేవర స్టోరీని పూర్తిగా చూపించడం చాలా కష్టమని..ఎక్కడ డైలాగ్స్ గానీ, పాత్రల తగ్గింపులు గానీ ఎక్కడ తగ్గించేలా లేవు అని స్పష్టం చేశారు. అందుకే రెండు భాగాలుగా దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు కొరటాల శివ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ALSO READ : ODI World Cup 2023: చెన్నై చేరుకున్న భారత్, ఆసీస్ జట్లు.. తొలి మ్యాచుకు అంతా సిద్ధం

RRR మూవీతో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్  నుంచి వస్తోన్న చిత్రం కావడంతో దేవర సినిమాపై భారీ లెవెల్లో హైప్ ఉంది. ఈ మూవీని యువసుధ క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో..మరో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్(Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలూ సమకూరుస్తున్నారు.