Devara2: అంచనాలు పెంచేస్తోన్న కొరటాల థాట్స్.. దేవర ప్రపంచంలోకి రణబీర్ కపూర్,రణవీర్ సింగ్!

Devara2: అంచనాలు పెంచేస్తోన్న కొరటాల థాట్స్.. దేవర ప్రపంచంలోకి రణబీర్ కపూర్,రణవీర్ సింగ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ దేవర (Devara).. ప్రస్తుతం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్టర్ శివ కొరటాల (Shiva Koratala) పాన్ ఇండియాలో స్థాయిలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్క్ చేరుకోడానికి దగ్గర్లో ఉంది. ఈ సినిమా రిలీజై 15 రోజులు కావొస్తున్నా థియేటర్లో దేవర హంగామా నడుస్తోంది. అయితే, దేవర 2 కోసం కొరటాల చాలా ప్రశ్నలే ప్రేక్షకుల ముందుంచారు. ఒక్కో ఆడియన్.. దేవరలో దాగున్న కథను బ్రేక్ డౌన్ చేస్తూ తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. 

ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల దేవర 2పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్గానేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర 2 మూవీలో ఎవరెవరు నటించాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

Also Read :  వేట్టయన్ ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డు వసూళ్లు

'నిజానికి నా కోరికల జాబితాలో దేవర 2 కోసం చాలా మందే నటులు ఉన్నారు. అయితే, అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ, బాలీవుడ్ స్టార్స్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) లేదా రణ్ బీర్ కపూర్‌ (Ranbir Kapoor) లను దేవర ప్రపంచంలో చూడాలనుకుంటున్నానని తెలిపారు. ఇంకొంతమంది పేర్లు అనుకుంటున్నా. కానీ, ఇప్పుడే ఏం చెప్పలేను. ఎందుకంటే, భారీ ఎక్స్‌పెక్టేషన్స్, ఎక్కువ రూమర్స్ వస్తాయి'' అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

అయితే, ఎలాంటి స్టార్ ని తీసుకున్నా.. జస్ట్ వచ్చి పోయే క్యామియో రోల్స్ కోసం మాత్రం తీసుకోను. సినిమాలోవారి పాత్ర చాలా అతి ముఖ్యమై ఉంటేనే తీసుకోడానికి ఇష్టపడతానని.. త్వరలో దేవర 2 కోసం నటీనటులను ఆవిష్కరిస్తానని కొరటాల వెల్లడించారు. ఇప్పటికే భైరగా సైఫ్ అలీ ఖాన్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించాడో చూసాం. దీంతో రణబీర్ కపూర్ లేదా రణవీర్ లను తీసుకుంటే మాత్రం ఎన్టీఆర్ తో యుద్ధం సంభవమే! అని చెప్పొచ్చు. ఏమవుతుందో చూడాలి.