వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియ‌న్ కంపెనీల ఆస‌క్తి

తెలంగాణలో  భారీ పెట్టుబడులే..లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఫారెన్ టూర్ కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రపంచంలో దిగ్గజ కంపెనీలతో సక్సెస్ ఫుల్ గా అగ్రిమెంట్లు కుదిరాయి. CM US టూర్ లో రాష్ట్రానికి 31 వేల కోట్లకుపైగా పెట్టుబడులు ఓకే అయ్యాయి. ప్రస్తుతం సౌత్ కొరియాలో సీఎం టూర్ కొనసాగుతోంది. సిటీలో భారీ పెట్టుబడులకు పెద్దపెద్ద కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు సీఎం. ఇక...సీఎం టూర్ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు 13న సౌత్ కొరియా నుంచి సింగాపూర్ వెళ్తారు. ఆగస్టు 14న తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.. 

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సీఎం బృందం కీలక కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. సియోల్ లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కంపెనీ అంగీకారం తెలిపింది. మెగా టెస్టింగ్ సెంటర్ లో ఆటోమేటిక్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో  హ్యుందాయ్ అత్యాధునిక కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు.

 ప్రపంచ దిగ్గజకంపెనీలన్నీతెలంగాణకు వచ్చేందుకు ఆసక్తిచూపుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలు అమలు చేస్తోందన్నారు. సత్వర అనుమతితోపాటు.. ప్రపంచ స్థాయి వసతలు కల్పిస్తున్నామన్నారు రేవంత్. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో వ్యాపారం చేసేందుకు HMIE వంటి అత్యుత్తమ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. భారత దేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని అన్నారు HMIE ప్రతినిధులు. కంపెనీ ఏర్పాటుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

 LG కంపెనీలో భాగమైన LS కంపెనీ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు.  తెలంగాణలో ఎలక్ట్రికల్ కేబుల్స్,గ్యాస్, ఎనర్జీ బ్యాటరీల తయారీ కోసం పెట్టుబడులు పెట్టేందుకు LS కంపెనీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. త్వరలోనే LSబృందం రాష్ట్రాన్ని సందర్శించనుందన్నారు.

 కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్. కొరియన్ టెక్స్ టైల్స్ కంపెనీలను వరంగల్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు.  టెక్స్ టైల్ రంగానికి అన్ని విధాలా వరంగల్ అనుగుణంగా ఉంటుందని వివరించారు సీఎం రేవంత్.