ఏప్రిల్14 నుంచి దళిత, బహుజన హక్కుల సాధికారిత ప్రచారోద్యమం

ఏప్రిల్14 నుంచి దళిత, బహుజన హక్కుల సాధికారిత ప్రచారోద్యమం
  • డీబీఎఫ్​వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్..

ముషీరాబాద్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్​అంబేద్కర్ జయంతి(ఏప్రిల్​14) నుంచి జాతీయ స్థాయిలో దళిత బహుజన హక్కుల సాధికారత ప్రచారోద్యమం చేపడుతున్నట్లు డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ తెలిపారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, బడ్జెట్, భూమి, ఉపాధి, విద్య, కులగణన అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించారు. 

కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలపై వివక్ష, హక్కుల అమలులో పాలకులు నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందున్నారు. కేంద్ర బడ్జెట్ లో అణగారిన వర్గాలకు అన్యాయం చేసి, కార్పొరేట్ శక్తులకు బాసటగా నిలిచారని మండిపడ్డారు. ఉపాధి హామీ పరిశోధకులు చక్రధర బుద్ధ, అడ్వకేట్ వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, రమేశ్, పూర్ణ, నరసింహ, పులి కల్పన, శారద, ఉమా తదితరులు పాల్గొన్నారు.